ఆంధ్రప్రదేశ్‌లో అయితే తెలంగాణ పోలీసులు నన్ను ఎలా అరెస్ట్‌ చేస్తారు?

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్‌లో సంఘటన జరిగితే తెలంగాణ పోలీసులు తనని ఎలా అరెస్ట్‌ చేస్తారంటూ సృష్టి టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌ డాక్టర్‌ నమ్రత అన్నారు. సికింద్రాబాద్ కోర్టులో బెయిల్ కోసం సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ నిందితులు పిటిషన్ దాఖలు చేశారు. 35 ఏళ్ల పాటు సుదీర్ఘ అనుభవం ఉన్న తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాల నుండి ఒక్క ఫిర్యాదు కూడా లేదు. నేరం జరిగింది ఆంధ్రప్రదేశ్‌లో.. తెలంగాణ పోలీసులు నాపై కేసులు ఎలా నమోదు చేసి అరెస్ట్ చేస్తారని ప్రశ్నిస్తూ పిటిషన్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)