ప్రియురాలి కోసం అర్ధరాత్రి గ్రామంలోకి ప్రవేశించి గామస్తులతో తన్నులు తిన్న ప్రియుడు

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో అర్ధరాత్రి డ్రోన్ దొంగలు తిరుగుతున్నారని కలకలం చెలరేగింది. డ్రోన్‌ల ద్వారా ఇళ్లను టార్గెట్ చేసి దోపిడీలకు పాల్పడుతున్నారన్న వార్తల నేపథ్యంలో దొంగల కోసం స్థానికులు కాపాలా కాస్తున్నారు. అయితే గ్రామానికి చెందిన ఓ వివాహితతో పొరుగు ఊరుకు చెందిన యువకుడితో సంబంధం ఉంది. ఎవరికీ అనుమానం రాకుండా అర్ధరాత్రి ఆమెను కలిసేందుకు ఇద్దరు స్నేహితులతో ప్రేమికుడు గ్రామంలోకి వచ్చాడు. అంతే అప్పటికే దొంగల కోసం కనిపెడుతున్న గ్రామస్తులకు.. ఈ ముగ్గురు కంటపడ్డారు. ఇంకేముందు డ్రోన్ దొంగలుగా భావించి ఎటాక్ చేశారు. ప్రేమికుడు దొరికిపోగా మరో ఇద్దరు స్నేహితులు పరారయ్యారు. ప్రేమికుడిని పట్టుకుని చితకబాదారు. అయితే గ్రామంలోకి ఎందుకు వచ్చాడో విషయం తెలియజేయలేదు. అయితే స్థానికులు పోలీసులకు సమాచారం అందించి అప్పగించారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. డ్రోన్ దొంగల పుకారుతో పాపం అడ్డంగా బుక్కైపోయాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)