22 మంది అనాథ చిన్నారులను దత్తత తీసుకోనున్న రాహుల్ గాంధీ

Telugu Lo Computer
0


పరేషన్‌ సిందూర్‌ సమయంలో సరిహద్దు ఉద్రిక్తతల్లో తల్లిదండ్రులు, కుటుంబాలను కోల్పోయిన పూంఛ్‌ జిల్లాకు చెందిన 22 మంది చిన్నారులను రాహుల్‌ దత్తత తీసుకోనున్నట్లు జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ చీఫ్ హమీద్ వెల్లడించారు. ఆ చిన్నారులు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసేవరకు వారి విద్య, వైద్యం, మనుగడకయ్యే ఖర్చులను ఇకపై రాహుల్‌ చూసుకోనున్నట్లు తెలిపారు. ఇటీవల భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య ఘర్షణ నేపథ్యంలో దాయాది చర్యలకు దెబ్బతిన్న జమ్మూకశ్మీర్‌ సరిహద్దు గ్రామాలను రాహుల్‌ గాంధీ సందర్శించిన సమయంలో పూంఛ్‌లో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సంబంధించిన వివరాలు తీసుకొని ఓ జాబితా రూపొందించాలని పార్టీ నేతలను ఆదేశించినట్లు హమీద్‌ తెలిపారు. ఇందులోభాగంగానే సర్వే చేసి 22 మంది చిన్నారుల జాబితాను రూపొందించామని పేర్కొన్నారు. పూంఛ్‌లోని క్రైస్ట్ పబ్లిక్ స్కూల్‌ను సందర్శించిన రాహుల్‌ తల్లిదండ్రులను కోల్పోయిన పలువురు విద్యార్థులకు వారి చదువుకు అయ్యే ఖర్చు పైనా భరోసా ఇచ్చినట్లు చెప్పారు. ఇందులోభాగంగానే సర్వే చేసి 22 మంది చిన్నారుల జాబితాను రూపొందించామని.. త్వరలో ఆ చిన్నారులకు తొలివిడత సహాయాన్ని అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఆ దాడిలో సర్వస్వం కోల్పోయిన కుటుంబాలకు చెందిన పలువురు చిన్నారుల విద్యకు సంబంధించిన ఖర్చులను కూడా రాహుల్‌ భరించనున్నట్లు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)