క్యూలో రమ్మన్నందుకు రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని, జుట్టుపట్టి లాగి కొట్టిన వ్యక్తి

Telugu Lo Computer
0


హారాష్ట్రలోని కళ్యాణ్ జిల్లా నందివాలీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అపాయింట్ మెంట్ లేకుండా వచ్చిన ఓ వ్యక్తిని వరుస క్రమంలో రమ్మని చెప్పినందుకు ఓ మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని, జుట్టుపట్టిలాగి భౌతిక దాడికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. సోమవారం సాయంత్రం రిసెప్షనిస్ట్‌ విధుల్లో ఉండగా ఆస్పత్రికి కొంతమంది రోగులు వచ్చారు. అయితే, అప్పటికి డాక్టర్ రాకపోవడంతో వారిని వేచి వుండమని చెప్పింది. ఆలస్యంగా వచ్చిన ఆ డాక్టర్ ముందుగా మెడికల్ రిప్రజెంటేటివ్‌ను కలిసి మాట్లాడారు. అప్పటికే ఆయన కోసం వేచివున్న రోగులు దీనిపై రిసెప్షనిస్ట్‌ను నిలదీశారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి తన కుమారుడు చెకప్ కోసం ఆస్పత్రికి వచ్చాడు. అపాయింట్ మెంట్ లేకుండానే డాక్టర్ క్యాబిన్‌ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా, రిసెప్షనిస్ట్ అతడిని అడ్డుకుని క్యూలో రావాలని కోరింది. దీంతో ఆగ్రహించిన ఆ వ్యక్తి ఆమెపై దాడి చేశాడు. కాలితో తన్ని, జట్టుపట్టి లాగి తీవ్రంగా కొట్టాడు. పక్కనే ఉన్న కొంతమంది అతడిని బలవంతంగా పట్టుకుని బయటకు పంపించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఇది కాస్తా వివాదాస్పదంగా మారింది. బాధిత యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు గోకుల్ ఝాను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)