ఎయిరిండియాకు ఆరు నెలల్లో తొమ్మిది నోటీసులు జారీ !

Telugu Lo Computer
0


ఐదు భద్రతా ఉల్లంఘనలకు సంబంధించి ఎయిరిండియాకు గత 6 నెలల్లో 9 షోకాజ్ నోటీసులు ఇచ్చినట్టు కేంద్రం తెలిపింది. ఒక ఉల్లంఘనకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్య కూడా పూర్తయిందని వివరించింది. ఈ మేరకు రాజ్యసభ ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామమోహన్ నాయుడు సోమవారం సమాధానం ఇచ్చారు. అహ్మదాబాద్‌లో గత నెలలో బోయింగ్ డ్రీమ్‌లైనర్ కుప్పకూలిన దుర్ఘటనలో 260 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో అన్ని బోయింగ్ 787-8/9 డ్రీమ్‌లైనర్ల తనిఖీలకు డీజీసీఏ ఆదేశించిందని మంత్రి వివరించారు. మొత్తం 33 విమానాల్లో 31 ఆపరేషనల్ ఎయిర్‌క్రాఫ్ట్‌లలో తనిఖీలు నిర్వహించగా 8 విమానాల్లో చిన్నచిన్న లోపాలు గుర్తించినట్టు రామమోహన్ నాయుడు చెప్పారు. లోపాలు సవరించిన అనంతరం తిరిగి విమాన సర్వీసులు కొనసాగుతున్నాయని తెలిపారు. తక్కిన 2 విమానాలు షెడ్యూల్ట్ మెయింటెనెన్స్‌లో ఉన్నట్టు బీజేపీ సభ్యుడు అశోక్‌రావు శంకర్‌రావు చవాన్ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)