దేశీయ మార్కెట్లో జెలియో మొబిలిటీ జెలియో గ్రేసీ+ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసింది. ఈ స్కూటర్‌ను ఆరు వేరియంట్‌ల ఆప్షన్ తో తీసుకొచ్చారు. జెల్ బ్యాటరీ, లిథియం అయాన్ బ్యాటరీ ఆప్షన్ ఉన్నాయి. ఇది 60V/ 32AH బ్యాటరీతో పాటు 72V/ 42AH జెల్ బ్యాటరీని కలిగి ఉంది. మరోవైపు, 60V/30AH మరియు 74V/32AH లిథియం అయాన్ బ్యాటరీ ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి. దీనితో, స్కూటర్ 80 కి.మీ నుంచి 130 కి.మీ వరకు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. జెలియో నుంచి వచ్చిన గ్రేసీ ప్లస్ లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 10, 12 అంగుళాల టైర్లు, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్, డిజిటల్ మీటర్, DRL, కీ-లెస్ డ్రైవ్, యాంటీ-థెఫ్ట్ అలారం, పార్కింగ్ గేర్, USB ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు అందించారు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 54 వేల నుంచి ప్రారంభమవుతుంది. దీని టాప్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 69500. ఇది తెలుపు, బూడిద, నలుపు, నీలం వంటి నాలుగు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. దీనితో పాటు, లిథియం-అయాన్ బ్యాటరీతో కూడిన వేరియంట్లపై రెండు సంవత్సరాల వారంటీ, మూడు సంవత్సరాల వారంటీతో అందించబడుతోంది.
జెలియో గ్రేసీ+ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల
July 21, 2025
0
Tags