మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ సహా మొత్తం 7 మంది నిందితులను నిర్దోషులుగా ఎన్‌ఐఏ కోర్టు ప్రకటించింది. పేలుళ్లలో వారి ప్రమేయం ఉన్నట్లు బలమైన ఆధారాలు లేవని పేర్కొన్న ఎన్‌ఐఏ కోర్టు ప్రాసిక్యూషన్ ఆధారాలు అస్పష్టంగా, దుష్ప్రభావితంగా ఉన్నాయని అభిప్రాయపడింది. 2008 సెప్టెంబర్ 29వ తేదీన నాసిక్‌లోని రంజాన్ మాసంలో ఓ మసీదు వద్ద ద్విచక్ర వాహనానికి అమర్చిన బాంబు పేలడంతో ఆరుగురి మృతి చెందారు. మరో 95 మంది గాయపడ్డారు. ఈ కేసులో సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌ను మహారాష్ట్ర ఏటీఎస్( అరెస్ట్ చేసింది. పేలుడు జరిగిన బైక్ ఆమెకు చెందిందేనని అభియోగం నమోదు అయ్యింది. మొత్తం 11 మందిని నిందితుల జాబితాలో చేర్చగా.. ప్రజ్ఞాతో పాటు లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్, మరో ఐదుగురిని ప్రధాన నిందితుల జాబితాలో చేర్చింది. 2011లో కేసు ఎన్‌ఐఏకు బదిలీ అయ్యింది. 2018 నుంచి ఎన్‌ఐఏ కోర్టులో విచారణ ప్రారంభమైంది. ఈ ఏడాది ఏప్రిల్ 19న తుది వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్ చేసింది కోర్టు. మొత్తం 323 మంది సాక్ష్యులను కోర్టు విచారించింది. అలాగే 10,800+ ఆధారాలు, 404 సీజ్ చేసిన వస్తువులను పరిశీలించింది.
మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో నిందితులను నిర్దోషులుగా ఎన్‌ఐఏ కోర్టు !
July 31, 2025
0
Tags