సీనియర్ సిటిజన్ కార్డు సర్వీసుకు దరఖాస్తు ఫీజు మినహాయింపు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వార్డు సచివాలయాలలో దరఖాస్తు చేస్తున్న సీనియర్ సిటిజన్ కార్డు సర్వీసుకు దరఖాస్తు ఫీజును ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించకుండానే ఉచితంగా సర్వీసును ప్రజలు పొందవచ్చు. ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. 60 ఏళ్లు నిండిన వారికి సీనియర్ సిటిజన్ కార్డును డిజిటల్‌గా ఇస్తోంది. ఈ కార్డుతో ప్రభుత్వ, ప్రైవేటు సేవలు పొందడం సులువు అవుతుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ సేవ అందుబాటులో ఉంటుంది. మీసేవా కేంద్రాలు, ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా కూడా పొందవచ్చు. అవగాహన ఉన్నవారు మొబైల్ ఫోన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. వయసు ధృవీకరణ లేదా ఏదైనా ఆధార్ కార్డు లేదా గుర్తింపు కార్డు, అడ్రస్ ప్రూఫ్, ఫోటో, బ్లడ్ గ్రూప్, ఎమర్జెన్సీలో సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు, బ్యాంక్ అకౌంట్‌తో పాటూ అవసరమైన పత్రాలు సమర్పించాలి. ఈ సీనియర్ సిటిజన్ కార్డుల్ని 60 ఏళ్లు దాటిన పురుషులు, 58 ఏళ్లు దాటిన మహిళలకు ఇస్తారు.. ఈ సీనియర్‌ సిటిజన్‌ కార్డు దేశవ్యాప్తంగా ఉపయోగపడుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.. జిల్లా దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ సహాయ సంచాలకుల కార్యాలయంలో కూడా ఇస్తారు. ఈ సీనియర్ సిటిజన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న రోజే పది, 15 నిమిషాల్లో ఇస్తారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)