భవిష్యత్తులో యూపీఐ చెల్లింపులు చేయాలంటే ఫీజు చెల్లించాల్సి రావచ్చు !

Telugu Lo Computer
0


విష్యత్తులో యూపీఐ వినియోగదారులు డిజిటల్ చెల్లింపులు చేయడానికి రుసుము చెల్లించాల్సి రావచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా సూచనప్రాయంగా చెప్పారు. పూర్తిగా ఉచిత డిజిటల్ లావాదేవీల యుద్ధం త్వరలో ముగిసిపోవచ్చని ఆయన అన్నారు. యూపీఐ నిరంతరం కొత్త శిఖరాలను చేరుకుంటుందని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. అయితే దానిని ఆర్థికంగా స్థిరంగా ఉంచడానికి ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఖర్చులను ఎవరో ఒకరు భరించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్‌తో సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ. యూపీఐ ప్రస్తుతం ఎటువంటి యూజర్ ఛార్జీ లేకుండా నడుస్తోందని, ఈ మొత్తం వ్యవస్థను వినియోగదారులకు ఉచితంగా అందించడానికి ప్రభుత్వం బ్యాంకులు, ఇతరులకు ఆర్బీఐ సబ్సిడీని అందిస్తోందన్నారు. చెల్లింపు, డబ్బు నేటి కాలానికి జీవనాడిలా మారింది. కాబట్టి మనకు సమర్థవంతమైన, బలమైన వ్యవస్థ అవసరమని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే యుపిఐతో అనుబంధించబడిన బ్యాంకులు, ఇతర సంస్థలకు ప్రభుత్వం సబ్సిడీని అందిస్తోంది. తద్వారా యుపిఐ చెల్లింపు వ్యవస్థను ఉచితంగా ఉంచవచ్చు. అయితే భవిష్యత్తులో ఇది మారవచ్చు. యూపీఐ ఉపయోగం కోసం కొంత ఖర్చు చెల్లించాల్సి ఉంటుందని సంజయ్ అన్నారు. దీన్ని ఉచితంగా ఉంచాలంటే ఎవరైనా ఖర్చులు భరించాల్సిందే అని మల్హోత్రా స్పష్టం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)