తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్

Telugu Lo Computer
0


తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం త్రిపుర హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన సేవలందిస్తున్నారు. కొలిజియం చేసిన సిఫార్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించడంతో ఈ బదిలీ అమలులోకి వచ్చింది. జూలై 14, 2025న విడుదల చేసిన కేంద్ర నోటిఫికేషన్ ప్రకారం నాలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల బదిలీలు జరగనున్నాయి. అందులో భాగంగా త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్‌ను తెలంగాణ హైకోర్టుకు నియమించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)