కర్నూలు-విజయవాడకు విమాన సర్వీసుల్ని వర్చువల్ గా ప్రారంభించిన రామ్మోహన్ నాయుడు

Telugu Lo Computer
0


మరావతి పనులు జోరుగా సాగుతున్న నేపథ్యంలో రాయలసీమ నుంచి ఇక్కడికి రాకపోకలు కూడా పెరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో రెగ్యులర్ గా రాకపోకలు సాగించే వారికి కర్నూలు-విజయవాడ మధ్య ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు కొత్త సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. కర్నూలు ఎయిర్ పోర్టు నుంచి విజయవాడలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి రెగ్యులర్ విధానంలో విమానాలు నడిపేందుకు ఇండిగో ఎయిర్ లైన్స్ సిద్దమైంది. ఇవాళ పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీ నుంచి కర్నూలు-విజయవాడ మధ్య ఇండిగో విమాన సర్వీసుల్ని వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ప్రస్తుతానికి వారానికి మూడు రోజుల పాటు ఈ సర్వీసులు రాకపోకలు సాగిస్తాయి. అనంతరం వీటిని రోజువారీ సర్వీసులుగా విస్తరిస్తారు. కర్నూలు ఎయిర్ పోర్టును అభివృద్ధి చేయడంతో పాటు ఇక్కడి నుంచి రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు రెగ్యులర్ విమానాలు నడిపేందుకు కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పుడు అమరావతి రాజధానికి ప్రయాణాన్ని సులభతరం చేస్తూ ఇండిగో రెగ్యులర్ సర్వీసులు ప్రారంభించింది. అలాగే కర్నూలు నుంచి ఇతర ప్రాంతాలకు కూడా మరిన్ని సర్వీసులు ప్రారంభిస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)