ఢిల్లీ వరద నీటిలో ఈత కొడతూ బాత్‌ టబ్బులో విహరిస్తూ వినూత్న రీతిలో నిరసనను తెలుపుతున్న ప్రజలు

Telugu Lo Computer
0


దేశ రాజధానిలో భారీ వర్షాల కారణంగా రోడ్లు జలమయం కావడంపై భాజపా ప్రభుత్వంపై ఆమ్‌ఆద్మీ పార్టీ విమర్శలు గుప్పించింది. వర్షాలకు రోడ్లపై భారీగా వరద నీరు నిలిచిపోవడంతో కొందరు వరద నీటిలో ఈత కొడతూ బాత్‌ టబ్బులో విహరిస్తూ వినూత్న రీతిలో తమ నిరసనను వ్యక్తం చేశారు. వీటికి సంబంధించిన వీడియోలను ఆప్‌ నేతలు సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తూ అధికార భాజపా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ఈ దుస్థితి తలెత్తిందని విమర్శలు గుప్పించారు. ఢిల్లీ రోడ్లు, వీధుల్లో వరద సమస్యలపై ప్రజలు ప్రభుత్వానికి ఎన్ని ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆప్‌ సీనియర్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి ఆతిశీ మండిపడ్డారు. ఢిల్లీలో అన్ని వీధుల్లో స్విమ్మింగ్‌ పూల్స్‌ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆతిశీ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. గతంలో దేశ రాజధానిలో నీటి ఎద్దడిని ఎదుర్కోవడం గురించి స్పీచ్‌లు ఇచ్చిన రేఖా గుప్తాకు వాన నీటిని ఎలా మళ్లించాలో తెలియదా అని ఆతిశీ ప్రశ్నించారు. మనీశ్‌ సిసోడియా సైతం రహదారులపై భారీ ఎత్తున్న వరద నీరు చేరిన దృశ్యాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ విమర్శలపై భాజపా స్పందిస్తూ గత ప్రభుత్వం రోడ్లను బాగుచేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే అయినప్పటికీ ఢిల్లీని అభివృద్ధి చేయడానికి నిరంతరం పని చేస్తున్నామని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)