జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ సురాన్‌కోట్ తహసీల్ దార్ ప్రాంతంలో పోలీసులు, సైన్యం సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని గుర్తించి ధ్వంసం చేశారు. ఈ ఆపరేషన్‌లో భద్రతా దళాలు పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ రహస్య స్థావరం నుంచి మూడు హ్యాండ్ గ్రెనేడ్‌లు, బుల్లెట్లు, ఛార్జ్ లీడ్, ఇనుప రాడ్, వైర్ కట్టర్, కత్తి, పెన్సిల్ సెల్, లైటర్ సహా ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా దళాలు తెలిపాయి. ఈ ప్రాంతంలో భద్రతా పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఉగ్రవాదుల కార్యకలాపాలను నిశితంగా పరిశీలించిన అనంతరం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.
ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని ధ్వంసం చేసిన భద్రతా దళాలు
July 05, 2025
0
Tags