అద్దె ఇంట్లో బాత్రూంలో రహస్య కెమెరాను అమర్చిన యజమాని : యువతిపై అత్యాచారానికి ప్రయత్నం

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌కు చెందిన ఓ యువతి లక్నోలో అద్దె ఇంట్లో నివసిస్తోంది. ఈ నెల జూన్ 24న తన బాత్రూంలో ఓ రహస్య కెమెరా ఉండటాన్ని ఆమె గమనించి షాక్‌కు గురైంది. దాన్ని పరిశీలించగా, వైఫైకి కనెక్ట్ చేసి ఉందని గుర్తించింది. వెంటనే ఆ కెమెరాను తొలగించగా, ఇంటి యజమాని అక్కడికి వచ్చాడు. ముందుగా తన తప్పును ఒప్పుకొని క్షమించమని వేడుకున్నాడు. అయితే, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బాధితురాలు హెచ్చరించడంతో ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. బాధితురాలు అతడి నుంచి తప్పించుకుని గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన యజమాని, ఈ విషయం బయటకు చెబితే ఆమె తల్లిని చంపేస్తానని, సోదరిపై అత్యాచారం చేస్తానని తీవ్రంగా బెదిరించినట్టు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలు ధైర్యంగా ముందుకొచ్చి దుబగ్గా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు దుబగ్గా పోలీసులు నిందితుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్‌స్పెక్టర్ అభినవ్ వర్మ తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)