నా ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ సినిమాల్లో మున్నా భాయ్‌ ఎంబీబీఎస్‌ ఒకటి : గౌతమ్‌ అదానీ

Telugu Lo Computer
0


ముంబయిలో జరిగిన 'సొసైటీ ఫర్ మినిమల్లీ ఇన్వేసివ్‌ స్పైన్‌ సర్జరీ- ఆసియా పసిఫిక్‌' 5వ వార్షిక సదస్సులో ప్రముఖ పారిశ్రామిక వేత్త, అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ పాల్గొని మాట్లాడుతూ మున్నా భాయ్‌ ఎంబీబీఎస్‌, నా ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ సినిమాల్లో ఒకటి. అది కేవలం వినోదభరిత చిత్రమే కాదు. మంచి సందేశాన్నిచ్చింది. అందులో మున్నాభాయ్‌ కేవలం మందులతోనే రోగాన్ని నయం చేయకుండా మానవత్వం, ప్రేమతో వారికి చికిత్స చేస్తాడు. అలా బాధ నుంచి ఉపశమనం కలిగించడం అనేది శస్త్రచికిత్సల కంటే అతీతమైనది. అందులో మున్నాభాయ్‌ చెప్పినట్లుగా, మ్యాజిక్‌ ట్రిక్కులైనా, సర్జరీలైనా రెండింట్లో మానవత్వమే కన్పించాలి'' అని గౌతమ్‌ అదానీ గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా కెరీర్‌ తొలినాళ్లలో తాను తీసుకున్న నిర్ణయాలను అదానీ గుర్తుచేసుకున్నారు. ''16 ఏళ్ల వయసులో సెకండ్‌ క్లాస్‌ రైలు టికెట్‌ కొనుక్కుని ముంబయి వచ్చేశా. అప్పుడు నాకు ఎలాంటి డిగ్రీ లేదు. చేతిలో ఉద్యోగం లేదు. జీవితంలో ఎదగడానికి నా సొంత మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలన్న తపన మాత్రం ఉంది. మీరు ఏదైనా బలంగా కోరుకుంటే ఈ విశ్వం మొత్తం ఆసక్తికరంగా కన్పిస్తుంది. నా జీవితంలో అదే జరిగింది. ముంబయి వచ్చాక వజ్రాలను పాలిష్‌ చేయడం నేర్చుకున్నా. ఒక్కో రాయిని పాలిష్‌ చేస్తుంటే ఓపిక, విలువ ఎంత గొప్పవనే పాఠం నేర్చుకున్నా. నా తొలి డీల్‌ ఒక జపనీస్‌ కొనుగోలుదారుతో చేశా. అప్పుడు రూ.10వేలు సంపాదించా. డబ్బు ముఖ్యం కాదు. కానీ, నేను గెలవగలనన్న నమ్మకం కలిగింది అప్పుడే'' అని అదానీ తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)