కర్ణాటక లోని రాయచూరు జిల్లా సిరవార తాలూకా కడోణి తిమ్మాపురలో రమేశ్ నాయక్ తన రెండెకరాల పొలంలో సీడ్ పత్తిని సాగు చేశారు. కుటుంబ అవసరాల కోసం కొంత భాగంలో కూరగాయలను సాగు చేశారు. అందులో కాసిన గోరు చిక్కుడు కాయలను ఆదివారం ఇంటికి కోసుకు రాగా, సోమవారం రాత్రి వండుకుని కుటుంబ సభ్యులంతా తిన్నారు. వారికి మంగళవారం తెల్లవారు జామున వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. దీంతో గ్రామస్థులు లింగసుగూరు తాలూకా ఆస్పత్రికి తరలించారు. చికిత్స జరుగుతుండగానే రమేశ్ నాయక్ (38), కూతుళ్లు దీప(6), నాగమ్మ(8) మృతి చెందారు. భార్య పద్మ, కుమారుడు కృష్ణ, మరో కూతురు చైత్ర తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మెరుగైన చికిత్స కోసం రాయచూరులోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఎస్ఐ వెంకటేశ్ నాయక్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. కాగా, పొలంలో కొన్నాళ్ల క్రితం పంటకు పురుగుల మందు పిచికారీ చేశారని, ఈ కారణంగానే గోరుచిక్కుడు విషతుల్యమై ప్రాణాలు తీసి ఉంటుందని గ్రామస్థులు అంటున్నారు.
గోరుచిక్కుడు కూర తిని ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి
July 23, 2025
0
Tags