650 మంది స్టంట్‌మ్యాన్‌లకు ఆరోగ్య, ప్రమాద బీమా కల్పించిన అక్షయ్‌ కుమార్

Telugu Lo Computer
0


మిళ సినిమా 'వేట్టువం' షూటింగ్‌లో ప్రమాదవశాత్తూ స్టంట్‌మ్యాన్‌ రాజు మరణవార్త విని బాలీవుడు అగ్ర కథానాయకుడు అక్షయ్‌ కుమార్‌ చలించిపోయారు. దీంతో ఓ నిర్ణయం తీసుకున్నారు. ఇండస్ట్రీలోని 650 మంది స్టంట్‌ మ్యాన్‌లకు ఇన్సూరెన్స్‌ చేయించారు. మంచి మనసుతో ఆయన చేసిన ఈ పనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ ఇన్సూరెన్స్‌ పాలసీలో ఆరోగ్య, ప్రమాద బీమా రెండూ ఉన్నాయి. స్టంట్‌ మ్యాన్‌ సెట్‌లో, బయట ఎక్కడైనా గాయపడితే రూ.5 లక్షల వరకు బీమా పొందవచ్చు. అక్షయ్‌ చేసిన ఈ పనిపై బాలీవుడ్‌ ప్రముఖ స్టంట్‌ మాస్టర్‌ విక్రమ్‌సింగ్‌ స్పందించారు. 'మీకు ఎలా ధన్యవాదాలు తెలపాలో అర్థం కావట్లేదు. మీరు చేసిన ఈ పని వల్ల బాలీవుడ్‌లో దాదాపు 650 నుంచి 700 మంది స్టంట్‌మ్యాన్‌లు, యాక్షన్‌ సిబ్బంది ఇప్పుడు బీమా పరిధిలోకి వచ్చారు' అంటూ కృతజ్ఞతలు తెలిపారు.





Post a Comment

0Comments

Post a Comment (0)