నాలుగు రోజుల్లో దేవాదుల నీటిని విడుదల చేయకపోతే సీఎం ఇంటి ముందు ధర్నా చేస్తా !

Telugu Lo Computer
0


దేవాదుల నుంచి నీటిని విడుదల చేయడంలో రేవంత్ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు  ప్రశ్నించారు. నాలుగు రోజుల్లో దేవాదుల నీటిని విడుదల చేయాలని.. లేదంటే సీఎం రేవంత్‌రెడ్డి ఇంటిముందు ధర్నా చేస్తానని ఎర్రబెల్లి దయాకర్‌రావు హెచ్చరించారు. దేవాదుల నుంచి నీటిని విడుదల చేయాలని రేవంత్ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పాలకుర్తి మండలం మాదాపురం దంతాలతండా నుంచి ఇవాళ  ఎర్రబెల్లి దయాకర్‌రావు పాదయాత్రని ప్రారంభించారు. పాదయాత్రలో రైతులతో ఎర్రబెల్లి మాట్లాడారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. బీఆర్ఎస్ రైతుల పక్షానా పోరాడుతోందని ఉద్ఘాటించారు. కేసీఆర్ ప్రభుత్వం రైతులకి మేలు చేసిందని చెప్పుకొచ్చారు. కాగా పాలకుర్తిలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దేవాదుల నుంచి నీటి విడుదలపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాటర్ వార్ కొనసాగుతోంది. దేవాదుల నీటిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీల మధ్య రాజకీయ రగడ రాజుకుంది. దేవాదుల నీటి విడుదలపై ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మధ్య దేవాదుల నీటి పంచాయతీ రగులుతోంది. దేవాదుల నీటిపై విడుదలపై నిన్న(గురువారం) అధికారులతో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి సమావేశం అయ్యారు. నీటిని విడుదల చేయాలని అధికారులను ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ఆదేశించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)