విమాన ప్రమాదం మృతుల కోసం రూ.500 కోట్లతో సంక్షేమ ట్రస్టు ఏర్పాటు చేస్తున్నట్టు టాటా సన్స్ అండ్ టాటా ట్రస్ట్స్ ప్రకటన

Telugu Lo Computer
0


గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన ఎయిర్ విమానం దుర్ఘటనలో మృతులను ఆదుకునేందుకు రూ.500 కోట్లతో సంక్షేమ ట్రస్టు ఏర్పాటు చేస్తున్నట్టు టాటా సన్స్ అండ్ టాటా ట్రస్ట్స్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి 'ది ఏఐ-171 మెమోరియల్ అండ్ వెల్ఫేర్ ట్రస్ట్'ను ముంబైలో రిజిస్టర్ చేసింది. ఇందుకోసం టాటా సన్స్, టాటా ట్రస్ట్ చెరో 250 కోట్లు ట్రస్టుకు జమ చేయనున్నాయి. విమాన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున ఈ ట్రస్టు అందజేస్తుంది. మానవ సంక్షేమాన్ని ప్రోత్సహించేందుకు (ఫిలాంత్రోపిక్ పర్పసెస్) ఏర్పాటు చేస్తున్న ఈ ట్రస్టు ద్వారా విమాన ప్రమాదంలో గాయపడిన వారికి వైద్య సహాయం అందించడం, ఘటనలో దెబ్బతిన్న బీజే మెడికల్ కాలేజీ ఇన్‌ఫ్రాస్టక్చర్ పునర్నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తారు. జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపట్లలో కుప్పకూలిపోయంది. ఈ ఘటనలో విమానంలోని 241 మందితో పాటు.. విమానం కుప్పకూలిన మెడికల్ కాలేజీ ప్రాంతంలోని 19 మంది మృతి చెందారు. విమానప్రమాదంపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)