తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలనే లక్ష్యంగా సర్కారు చేపట్టిన చర్యల్లో భాగంగా ఈరోజు పలువురు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు చిక్కారు. గచ్చిబౌలిలో ఈగల్ టీమ్ చేపట్టిన డకాయ్ ఆపరేషన్‌లో గంజాయిని కొనుగోలు చేస్తూ వీరు పట్టుబడ్డారు. ఇలా పట్టుబడిన వారిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లతో పాటు రియల్ ఎస్టెట్ వ్యాపారులు, డెంటల్ టెక్నీషియన్లు, విద్యార్థులు ఉన్నారు. రెండు గంటల పాటు ఈగల్ టీమ్ నిర్వహించిన డకాయ ఆపరేషన్‌లో 86 మంది వరకూ పట్టుబడ్డారు. మార్కెటింగ్ ఉద్యోగులు, హెచ్‌ఆర్ మేనేజర్లు సైతం ఈగల్ టీమ్‌కు చిక్కిన వారిలో ఉన్నారు. బాయ్ బచ్చా ఆగయా అంటూ వాట్సాప్ గ్రూప్ ద్వారా గంజాయి అమ్మకాలు జరుపుతున్నట్లు ఈగల్ టీమ్ అధికారులు గుర్తించారు.
డకాయ్ ఆపరేషన్‌లో గంజాయిని కొనుగోలు చేస్తూ పట్టుబడ్డ ఐటీ ఉద్యోగులు
July 18, 2025
0
Tags