మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎంపీలకు కూడా 40 శాతం కోటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల మాదిరిగానే ఎంపీలు కూడా ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధులే అని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా 17 మంది ఎంపీలకూ అవకాశం కల్పించాలని కోరారు. లబ్ధిదారుల ఎంపికలో సహేతుకత పెరగడానికి ఇది దోహదపడుతుందన్నారు. పేద ప్రజలకు మరింత న్యాయం జరగడం కోసమే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన నిధులు కూడా ఇందులో వినియోగిస్తున్నట్లు వివరించారు. గతంలో ఎంపీగా పనిచేసిన సీఎం రేవంత్ వెంటనే నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు రఘునందన్‌రావు లేఖలో పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎంపీలకు 40 శాతం కోటా ఇవ్వాలి !
July 10, 2025
0
Tags