జులై 21 నుంచి ఆగస్టు 21 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నట్లు అధికారికంగా ప్రకటన వెలువడింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ తేదీలకు ఆమోదం తెలపగా, ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ సమావేశాలు మొత్తం 26 రోజులు జరగనున్నాయి. అయితే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఆగస్టు 13, 14 తేదీల్లో సభలు ఉండవు. ముందుగా ఈ సమావేశాలు ఆగస్టు 12తో ముగియనున్నట్లు పేర్కొన్నారు. కానీ ఇప్పుడు మరో వారం రోజుల పాటు పొడిగించారు. ప్రభుత్వం ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టేందుకు యోచిస్తోంది. అందులో అణుశక్తి రంగంలో ప్రైవేటు సెక్టర్ ప్రవేశాన్ని అనుమతించే చట్టాలు ఉన్నాయి. సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్, అటామిక్ ఎనర్జీ చట్టంలో సవరణలు చేయాలని అనుకుంటోంది. కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన ప్రకటనను అమలు చేయడానికే ఈ వారం రోజుల వ్యవధిని పొడిగించినట్లు తెలుస్తోంది.
జులై 21 నుంచి ఆగస్టు 21 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
July 03, 2025
0
Tags