నిర్మాణంలో ఉన్న భవనంలో రీల్స్ చేస్తుండగా ప్రాణాలు కోల్పోయిన యువతి

Telugu Lo Computer
0


బెంగళూరులో నిర్మాణంలో ఉన్న భవనంలో రీల్స్ చేసే క్రమంలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. పైనుంచి కింద పడి చనిపోయింది. పోలీసులు తెలిపిన మేరకు బెంగళూరుకు చెందిన 20 ఏళ్ల నందిని ఓ హైపర్ మార్కెట్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తోంది. నందిని తన ముగ్గురు స్నేహితులతో కలిసి సౌత్ బెంగళూరు, పరప్పన అగ్రహారలోని నిర్మాణంలో ఉన్న 13 అంతస్తుల భవనంలోకి వెళ్లింది. అయితే, అక్కడికి వెళ్లిన తర్వాత నలుగురి మధ్య రిలేషన్ విషయంలో గొడవ జరిగింది. ఈ నేపథ్యంలోనే విషాదకరమైన రీల్ చిత్రీకరించడానికి నందిని బిల్డింగ్ టెర్రస్ మీదకు వెళ్లింది. అక్కడ రీల్ చిత్రీకరిస్తూ ఉన్న సమయంలో లిఫ్ట్ ఏర్పాటు చేసే హోల్‌లో పడి పోయింది. తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే చనిపోయింది. నందిని చనిపోయిందని ధ్రువీకరించుకున్న తర్వాత ముగ్గురు స్నేహితులు అక్కడినుంచి పారిపోయారు. బిల్డింగ్ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి వచ్చారు. నందిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అసహజ మరణం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ కెమెరా దృశ్యాలను చెక్ చేయగా నందిని స్నేహితురాలి గురించి తెలిసింది. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. పోలీసులు మాత్రం మరింత లోతుగా కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)