టూవీలర్లకు టోల్‌ ఫీజు వసూలు చేస్తారన్న వార్తలలో నిజం లేదు

Telugu Lo Computer
0


జులై 15 నుంచి జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలకు కూడా టోల్ ఫీజు వసూలు చేయాలని కేంద్రం నిర్ణయించిదంటూ వచ్చిన వార్తలలో నిజం లేదని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. కొన్ని మీడియా సంస్థలు ద్విచక్ర వాహనాలపై టోల్ పన్ను విధించడం గురించి తప్పుదారి పట్టించే వార్తలను వ్యాప్తి చేస్తున్నాయని తప్పుబట్టారు. టోల్ పన్నుపై పూర్తి మినహాయింపు కొనసాగుతుందని చెప్పారు. వాస్తవాలు తెలీకుండా తప్పుదారి పట్టించే వార్తలను వ్యాప్తి చేయడం సరికాదని పేర్కొన్నారు. ఎన్‌హెచ్‌ఏఐ కూడా ఇదే తరహా ప్రకటన విడుదల చేసింది. టోల్‌ ఫీజు ప్రతిపాదనేదీ లేదని స్పష్టంచేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)