ఇంటిగ్రేటెడ్ రాష్ట్ర సచివాలయం, హెచ్ఓడీ టవర్ల నిర్మాణానికి టెండర్లు ఖరారు

Telugu Lo Computer
0


మరావతిలో ఇంటిగ్రేటెడ్‌ రాష్ట్ర సచివాలయం, హెచ్‌ఓడీ టవర్ల నిర్మాణానికి ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసింది. టెండర్లలో ఎల్‌ 1గా నిలిచిన సంస్థలకు బిడ్లు ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటిగ్రేటెడ్ ఎపీ సెక్రటేరియట్, హెచ్‌ఓడీ కార్యాలయాల నిర్మాణ టెండర్లను ఎన్‌సీసీ లిమిటెడ్‌ సంస్థ దక్కించుకుంది. ఈ సంస్థ రూ.882.47 కోట్లతో సచివాలయంలోని జీఏడీ టవర్‌ను నిర్మించనుంది. ఇంటిగ్రేటెడ్‌ సచివాలయంలోని 1, 2 హెచ్‌ఓడీ టవర్ల నిర్మాణ పనులను షాపూర్‌ జీ పల్లోంజి సంస్థ దక్కించుకుంది. రూ.1487.11 కోట్ల వ్యయంతో ఈ టవర్ల నిర్మాణ పనులు చేపట్టనుంది. ఇంటిగ్రేటెడ్‌ సచివాలయంలోని 3, 4 హెచ్‌ఓడీ టవర్ల నిర్మాణ పనులను లార్సెన్‌ అండ్‌ టౌబ్రో లిమిటెడ్‌ దక్కించుకుంది. రూ.1303.85 కోట్ల వ్యయంతో నిర్మాణాలు చేపట్టనుంది. ఎల్‌ 1 బిడ్డర్లకు ప్రతిపాదిత పనులు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని సీఆర్డీఏ కమిషనర్‌కు ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌ సురేశ్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)