నేరేడు పండ్లు రక్త లోపాన్ని తీరుస్తాయి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఎంతో సహాయపడుతాయి. చెడు కొలెస్ట్రాల్ తో బాధపడే వారికి ఈ పండు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారు నేరేడు పండ్లకు ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఎందుకంటే నేరేడు పండ్లలో అధిక మొత్తంలో ఆక్సలేట్ ఉంటుంది. తద్వారా వీటిని తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్ల సమస్య పెరుగుతుంది. కాలేయ వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా నేరేడు పండ్లు తీసుకునే విషయంలో జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఈ పండ్లలో ఆక్సాలిక్ ఆమ్లం ఉంటుంది. ఇది కాలేయ వ్యాధులు ఉన్న రోగులకు హానికరం. ఈ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీంతో నేరేడు పండ్లు అధికంగా తీసుకుంటే మలబద్ధకం వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మలబద్ధకం ఉన్నవారు వీటిని తీసుకుంటే సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. గర్భిణీ స్త్రీలు ఈ పండ్లకు ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఈ పండ్లలో ఒత్తిడి వ్యవస్థను ప్రభావితం చేసే లక్షణాలు ఉంటాయి. నేరేడు పండ్లు ఎక్కువగా తింటే గర్భిణీ స్త్రీల రక్త ప్రవాహం ప్రభావితం అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
నేరేడు పండ్లు - లాభ నష్టాలు
June 07, 2025
0
Tags