ఈనెల 10 లోపు తెలంగాణ కేబినెట్ విస్తరణ ?

Telugu Lo Computer
0

తెలంగాణ కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హై కమాండ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఈనెల 10 లోపు కేబినెట్ విస్తరణ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేబినెట్‌లో ఎస్సీ, బీసీ, ఓసీలకు అవకాశం ఇవ్వనుంది. ఓసి నుంచి సుదర్శన్ రెడ్డి, బీసీ నుంచి వాకిటి శ్రీహరి, ఎస్సీ నుంచి గడ్డం ప్రసాద్‌లకు మంత్రి వర్గంలోకి తీసుకోనుండగా ప్రస్తుతం స్పీకర్‌గా ఉన్న గడ్డం ప్రసాద్‌ స్థానంలో మరొకరికి అవకాశం కల్పించే దిశగా కాంగ్రెస్‌ సర్కార్‌ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. గత కొంత కాలంగా తెలంగాణ కేబినెట్‌ విస్తరణపై ఊహాగాలు ఊపందుకున్నాయి. ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉండగా..ఇందులో నాలుగు స్థానాలను భర్తీ చేయనుందనే చర్చ జరిగింది. మైనారిటీలకు ఇవ్వాలనుకుంటే మరొకరికి అవకాశం కల్పించాల్సి ఉంది. ఇక మంత్రి పదవి రేసులో పలువురు ఎమ్మెల్యేల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. వారిలో చెన్నూర్‌ ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ వెంకటస్వామి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్‌, ఇబ్రహీంపట్నం మల్‌రెడ్డి రంగారెడ్డి, మక్తల్‌ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలు ఉన్నారు. ఈ అంశంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది

Post a Comment

0Comments

Post a Comment (0)