ప్రియురాలి మరణం తట్టుకోలేక ప్రియుడి ఆత్మహత్యాయత్నం

Telugu Lo Computer
0


హారాష్ట్రలోని నాగ్‌పూర్ పరిధిలోని కామలి పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. ప్రియుడితో జరిగిన చిన్నపాటి గొడవతో మనస్తాపానికి గురైన ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. ఆమె ఆకస్మిక మరణంతో దిగ్భ్రాంతికి గురైన యువకుడు ఆమెను కోల్పోయానన్న బాధను తట్టుకోలేకపోయాడు. మద్యం తాగి ఆమె అంత్యక్రియలు జరుగుతున్న ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ కాలుతున్న ప్రియురాలి చితిని చూస్తూ తట్టుకోలేక, ఒక్కసారిగా ఆ చితి మంటల్లోకి దూకేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో యువకుడు తీవ్రంగా గాయపడి, అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కన్హాన్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)