ఆధార్ నుంచి కొత్త యాప్ ?

Telugu Lo Computer
0


ధార్ కార్డును ప్రతి పదేళ్లకోసారి అప్‌డేట్ చేస్తుండాలి. పిల్లల ఆధార్ కార్డును అయితే 15 ఏళ్లు వచ్చేసరికి అప్‌డేట్ చేయాలి. చిరునామా, పేరులో చిన్న చిన్న మార్పులు, పుట్టిన తేదీ, జెండర్ ఇతర వివరాలు ఆన్‌లైన్‌లో మార్చుకోవచ్చు. మొబైల్ నెంబర్, ఈ మెయిల్ ఐడీ, బయోమెట్రిక్ వివరాలు, ఫోటో మార్పు కోసం సమీపంలోని ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే రానున్న రోజుల్లో ఈ ఇబ్బంది ఉండదు. కేవలం బయోమెట్రిక్, ఐరిస్ కోసం మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. ఆధార్ కార్డును అప్‌డేట్ చేసేందుకు ఆధార్ కేంద్రానికి వెళ్లి, గంటల తరబడి నిరీక్షించాల్సిన పని ఉండదు. నవంబర్ నాటికి యూఐడీఏఐ కొత్త యాప్ తీసుకొస్తోంది. ఈ యాప్ ఉంటే ఆధార్ కార్డులో ప్రతి అంశాన్ని ఇంట్లో కూర్చుని అప్‌డేట్ చేసుకోవచ్చు. అయితే సెక్యూరిటీ కోసం ఆధార్ అప్‌డేట్ చేసేందుకు ఓటీపీ ధృవీకరణ తప్పనిసరి. దీనికోసం లింకింగ్ ప్రక్రియ జరుగుతోంది. అన్నీ పూర్తయితే నవంబర్ నెలలో కొత్త యాప్ లాంచ్ కావచ్చు. ఒకసారి ఈ యాప్ అందుబాటులోకి వస్తే బయోమెట్రిక్, ఐరిస్ కోసం మాత్రమే ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుది. మిగిలిన పనులు యాప్ ద్వారా ఇంట్లోంచే చేసుకోవచ్చు. 

Post a Comment

0Comments

Post a Comment (0)