పరామర్శ పేరుతో సొంత పార్టీ కార్యకర్తలను బలిపెడుతున్నారు

Telugu Lo Computer
0


ప్రజల ప్రాణాలను పట్టించుకోని వైకాపా నైజాన్ని ఆంధ్రప్రదేశ్  ప్రజలు అర్థం చేసుకోవాలని తెదేపా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. పరామర్శ పేరుతో సొంత పార్టీ కార్యకర్తలను బలిపెడుతున్నారని మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని వారే చేసి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తారని ధ్వజమెత్తారు. ఐదేళ్ల రాక్షస పాలన నుంచి ప్రజలు రాష్ట్రాన్ని కాపాడారని చెప్పారు. ఏన్డీయే కూటమి ఏడాది పాలన సందర్భంగా నిర్వహించనున్న 'సుపరిపాలన-తొలి అడుగు' సభను వైకాపా నేతలు అసూయ పడేలా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)