ఛత్తీస్‌గఢ్‌లోని నవ రాయ్‌పూర్ అటల్ నగర్‌లో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్శిటీ , సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు కేంద్ర హోం అమిత్‌షా ఆదివారంనాడు శంకుస్థాపన చేసి మాట్లాడుతూ గత ఏడాది జనవరి నుంచి రాష్ట్రంలోని వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 400 మంది నక్సల్స్‌ను భద్రతా బలగాలు మట్టుబెట్టాయని అమిత్‌షా చెప్పారు. ప్రతిసారి రుతుపవనాల సీజన్‌లో సహజంగా నక్సల్స్ రెస్ట్ తీసుకుంటూ ఉంటారని, కానీ ఈసారి ఆ సీజన్‌లోనూ వారిని నిద్ర పోనీయమని, 31/3 (2026 నాటికి నక్సల్స్ నిర్మూలన) లక్ష్యం సాధించే దిశగా మరింత ముందుకు దూసుకు వెళ్తామని చెప్పారు. నక్సల్స్ లొంగిపోవాలని, లొంగుబాటు పాలసీని అందిపుచ్చుకుని ప్రయోజనాలు పొందాలని పిలుపునిచ్చారు. చర్యల అవసరం లేదు. కేవలం ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవడమే. ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని వారిని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం, కేంద్రం ప్రకటించిన హామీలన్నీ ఖచ్చితంగా అమలయ్యేలా చూస్తాం. అంతకంటే ఎక్కువగా కూడా వారికి సాయం చేసేందుకు ప్రయత్నిస్తాం' అని అమిత్‌షా నక్సల్‌కు సూచించారు.
రుతుపవనాల సీజన్‌లో నక్సల్స్‌ను నిద్ర పోనీయం
June 22, 2025
0
Tags