ఏపీ లా సెట్, పీజీ లాసెట్ ఫలితాలను ఉన్నత విద్యాశాఖ గురువారం విడుదల చేసింది. లాసెట్, పీజీ లాసెట్‌లో 98 శాతం ఉత్తీర్ణత సాధించారు. లా సెట్, పీజీ లాసెట్‌లో 20,826 మంది అర్హత సాధించారు. లాసెట్, పీజీ లాసెట్‌లో బాలికలదే పైచేయిగా నిలిచింది. విద్యార్థులు తమ ర్యాంక్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్షలకు మొత్తం 27,253 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 20,826 మంది అర్హత సాధించారు. రాష్ట్రంలోని న్యాయ కళాశాలల్లో మూడేళ్ల, ఐదేళ్ల ఎల్ఎల్‌బీతో పాటు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 5వ తేదీన ఏపీ లాసెట్-2025 పరీక్షను నిర్వహించారు. 21,251 హాజరైన అభ్యర్థుల్లో 20826 మంది ఉత్తీర్ణత సాధించారు.
ఏపీ లాసెట్, పీజీ లాసెట్ ఫలితాలు విడుదల
June 19, 2025
0
Tags