ఉత్తరప్రదేశ్ తాత్కాలిక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) రాజీవ్ కృష్ణ విడుదల చేసిన డేటా ప్రకారం రాష్ట్రంలో గత ఎనిమిదేళ్లలో 14,741 ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్లలో 234 మంది భయంకరమైన నేరస్థులు మరణించారు. 9,202 మంది నేరస్థులు గాయపడ్డారు. మొత్తం 30,293 మంది నేరస్థులను అరెస్టు చేశారు. 18 మంది పోలీసులు సైతం మరణించారు. ఈ కాలంలో 1,700 మంది పోలీసులు గాయపడ్డారు. రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం జీరో టాలరెన్స్ పాలసీ కింద నేరస్థులపై చర్యలు తీసుకుంటోందని అధికారిక ప్రకటన పేర్కొంది.
ఎనిమిదేళ్లలో 14,741 ఎన్‌కౌంటర్లు చేసిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం
June 19, 2025
0
Tags