ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం

Telugu Lo Computer
0


రాయ్‌పూర్ నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వస్తున్న ఇండిగో విమానం 6ఈ 6313 ల్యాండింగ్‌కు కొన్ని నిమిషాల ముందు తీవ్రమైన కుదుపులకు లోనవడంతో పైలట్ ల్యాండింగ్‌ను రద్దు చేశాడు. విమానం నేలను తాకే సమయంలో వాతావరణం ఒక్కసారిగా ప్రతికూలంగా మారింది. గాలి వేగం గంటకు 80 కిలోమీటర్లకు చేరడంతో విమానం తీవ్రంగా కుదుపులకు లోనైంది. దీంతో అప్రమత్తమైన పైలట్ ల్యాండింగ్ సురక్షితం కాదని భావించి, విమానాన్ని తిరిగి గాల్లోకి తీసుకెళ్లాడు. ఆ సమయంలో విమానం లోపల ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. కిటికీ నుంచి చూస్తే బయట ఏమీ కనిపించనంతగా వాతావరణం మారిపోయింది.సాయంత్రం 5:05 గంటలకు ల్యాండ్ కావాల్సిన విమానం కొంతసేపు గాల్లోనే చక్కర్లు కొట్టిన అనంతరం 5:43 గంటలకు సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ విమానాశ్రయ అధికారులు ప్రయాణికులకు ఓ హెచ్చరిక జారీ చేశారు. ప్రతికూల వాతావరణం కారణంగా విమాన సర్వీసులపై ప్రభావం పడే అవకాశం ఉందని సూచించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)