బెంగళూరులోని కస్తూర్బా రోడ్డులో ఉన్న క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెందిన వన్8 కమ్యూన్ పబ్ అండ్ రెస్టారెంట్‌పై పబ్‌లో ధూమపానానికి సంబంధించి నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వన్8 కమ్యూన్ పబ్‌లో పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల సమయంలో, పబ్‌లో ధూమపానం చేసే వారి కోసం ప్రత్యేకంగా కేటాయించిన స్థలం లేదని అధికారులు గుర్తించారు. ఇది సిగరెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం నిబంధనలకు విరుద్ధమని వారు తెలిపారు.ఈ ఉల్లంఘన నేపథ్యంలో, సదరు పబ్ మేనేజర్‌తో పాటు ఇతర సిబ్బందిపై సీఓటీపీఏ చట్టంలోని సెక్షన్-4, సెక్షన్-21 కింద కేసు నమోదు చేసినట్లు కబ్బన్ పార్క్ పోలీస్ ఎస్సై అశ్విని మీడియాకు వెల్లడించారు. చట్ట ప్రకారం అవసరమైన ఏర్పాట్లు చేయనందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
విరాట్ కోహ్లీ వన్8 కమ్యూన్ పబ్ అండ్ రెస్టారెంట్‌పై కేసు నమోదు
June 02, 2025
0
Tags