బ్రెయిన్‌లో ఓ భాగానికి రక్త సరఫరా ఆగిపోయినప్పుడు ఇస్కీమిక్ స్ట్రోక్ వస్తుంది. ఇది బ్రెయిన్ కణజాలానికి ఆక్సిజన్, పోషకాలు అందకుండా చేస్తుంది. ఈ పరిస్థితిని పట్టించుకోకపోతే ప్రాణాలే పోతాయి. ఈ సమస్య వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ వంటి వాటిని పట్టించుకోకపోవడం వల్ల ప్రాణాల మీదకే వస్తుంది. అందుకే వీటి విషయంలో ముందు జాగ్రత్త అవసరం. బ్రెయిన్ స్ట్రోక్ అన్నది బ్రెయిన్‌లోని ఓ భాగానికి రక్త సరఫరా నిరోధించి బ్రెయిన్ కణజాలానికి ఆక్సిజన్, పోషకాలు అందనప్పుడు వస్తుంది. దీని వల్ల బ్రెయిన్‌లోని కొన్ని కణాలు క్షణాల్లోనే చనిపోతాయి. మరోరకంగా హెమరేజిక్ స్ట్రోక్ వస్తుంది. బ్రెయిన్‌లోని రక్తనాళం లీక్ అయి, పగిలి బ్రెయిన్‌లో రక్తస్రావం అయినప్పుడే వస్తుంది. రక్తం బ్రెయిన్ కణాలపై ఒత్తిడిని పెంచుతుంది. వాటిని దెబ్బతీస్తుంది. అందుకే, సమస్యగా ఉన్నప్పుడు లక్షణాలను గుర్తించి వెంటనే డాక్టర్‌ని కలవాలి. లేదంటే ఇతర ప్రాణాంతక సమస్యలొచ్చి ప్రాణాలు పోతాయి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే కనిపించే ముఖ్య లక్షణాలలో ఒకటి మాట్లాడడంలో ఇబ్బంది. పదాలను స్పష్టంగా పలకలేకపోవడం, అర్థం చేసుకోలేకపోవడం వంటివి ఉంటాయి. అసలు మాటే సరిగా రాదు. దీంతో చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీంతోపాటు కళ్ళు సరిగా కనిపించకపోవడం, మసకగా కనిపించడం జరుగుతుంది. సాధారణంగా గంభీరంగా మాట్లాడేవారు ఈ టైమ్‌లో చిన్న మాటల్ని కూడా స్పష్టంగా మాట్లాడలేరు. సడెన్‌గా తలనొప్పి, వాంతులు, తలతిరగడం, స్పృహ తప్పడం వంటివి ఉంటాయి. ఒక్కసారిగా మూర్ఛవచ్చినట్లుగా ఉంటుంది. అప్పటికప్పుడు కళ్ళు తిరిగినట్లుగా కిందపడిపోయినట్లుగా ఉంటుంది. ఈ సమస్య పెరిగితే మూర్ఛ, గందరగోళం, కోమా, స్పృహ కోల్పోవడం వంటివి ఉంటాయి. బ్యాలెన్స్, కో ఆర్డినేషన్ ఉండదు. నడవడానికే ఇబ్బంది పడతారు. రెండు అడుగులు వేయడానికి కూడా చాలా టైమ్ పడుతుంది. ముఖం, చెయి, కాలు తిమ్మిరి, బలహీనత ఉంటుంది. ఇది రెగ్యులర్‌గా ఒకవైపుకి మాత్రమే వస్తుంది. రెండు చేతుల్ని తలపైకి లేపినప్పుడు ఒక చేయి ఆగకుండా కిందకి పడిపోతుంటే అది స్ట్రోక్ లక్షణమనుకోవచ్చు. అలానే నవ్వినప్పుడు కూడా నోరు ఓ వైపుకి వంగడం ఉంటుంది. సమస్య రావడానికి చాలానే కారణాలు ఉంటాయి. వాటిని ముందుగానే గుర్తించాలి. లైఫ్‌స్టైల్ సరిగా లేకపోవడంఅధిక బరువుఫిజికల్ యాక్టివిటీ లేకపోవడంఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడండ్రగ్స్ వంటివి తీసుకోవడంహైబీపిసిగరెట్ స్మోకింగ్, సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ చేయడం వల్ల కూడా సమస్య వస్తుంది. అబస్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియాహార్ట్ ఫెయిల్యూర్, గుండె లోపాలు, గుండె ఇన్ఫెక్షన్, కర్ణిక దడ వంటి హార్ట్ బీట్ లోపాలతో సహా ఇతర సమస్యలు. వయసు పెరిగే కొద్దీ ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 55 దాటిన వారికి సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మగవారికే రిస్క్ మగవారికి ఆడవారి కంటే స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఆడవారికి ఎక్కువగా వయసు ఉన్నవారికి సమస్య వస్తుంది. గర్భనిరోధక ట్యాబ్లెట్స్, ఈస్ట్రోజెన్ వంటి ట్రీట్‌మెంట్ తీసుకుంటే ప్రమాదం పెరుగుతుంది.
బ్రెయిన్ స్ట్రోక్ - లక్షణాలు - జాగ్రత్తలు
June 16, 2025
0
Tags