ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లా కోసిగి ప్రాంతంలో పంట చేలలో చిరుత పులి సంచరిస్తోంది. దీంతో అటువైపుగా వెళ్లడానికి స్థానిక రైతులు ఇబ్బంది పడుతున్నారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ అధికారులు అక్కడక్కడ ఎరలు ఏర్పాటు చేశారు. అయితే పంట పొలాలకు వెళ్లే రైతులు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని చూడకుండా ఏకంగా పులిని బంధించాలి అనుకున్నారు. పులిని పట్టుకుని అధికారులకు అప్పగించాలని భావించారు. ఇందులో భాగంగానే కొద్దిరోజులుగా మాటువేశారు. చివరికి వారి ప్రయత్నం ఫలించింది. ఓ పంట పొలంలో పులి నక్కి ఉండగా వెంటనే అక్కడి రైతులు తమ వెంట తెచ్చుకున్న వలను అత్యంత ఒడుపుగా పట్టుకొని పులి దగ్గరికి వెళ్లారు. అమాంతం పులి మీద ఆ వల వేశారు. అంతేకాదు పులికి ఏమాత్రం తేరుకునే అవకాశం ఇవ్వకుండా అందులో దానిని బంధించారు. చాలామంది వ్యక్తులు ఆ వలను అలానే పట్టుకొని అత్యంత జాగ్రత్తగా దానిని చుట్టుముట్టారు. ఆ తర్వాత ఆ వలను గట్టిగా కట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. పులిని పట్టుకున్న తర్వాత ఆ రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు ఆ పులిని తమ వెంట తీసుకెళ్లిపోయారు. ఎంతైనా మీరు తోపులు భయ్యా మీ ధైర్యానికి హ్యాట్సాఫ్. మీ గుండెస్థైర్యానికి సలాం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు
చాకచక్యంగా పులిని బంధించిన గ్రామస్తులు : సోషల్ మీడియాలో వీడియో వైరల్
June 16, 2025
0
Tags