బెంగళూరులో ర్యాపిడో బుక్ చేసుకున్న ఓ యువతికి ర్యాపిడో డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్‌తో యువతికి చుక్కలు చూపించాడు. ర్యాష్ డ్రైవింగ్, సిగ్నల్ జంప్ చేశాడని ఆ యువతి నిలదీయడంతో అతడు ఆవేశంతో రగిలిపోయాడు. మాటామాటా పెరగడంతో యువతిపై చేజేసుకున్నాడు. ఈ క్రమంలో ర్యాపిడో బైక్ రైడర్ సదరు అమ్మాయిని బలంగా చెంపదెబ్బ కొట్టడంతో ఆమె కిందపడిపోయింది. ఈ ఘటనను స్థానికులు ఏమాత్రం అడ్డుకోలేదు. కళ్లప్పగించి మాత్రం చూస్తుండిపోయారు. ఈ నెల 14వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇంకా దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
ర్యాపిడో డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్‌ని నిలదీసిన యువతిపై డ్రైవర్ దాడి : సోషల్ మీడియాలో వీడియో వైరల్
June 16, 2025
0
Tags