నాపై తప్పుడు ప్రచారం చేసి నా దగ్గర డబ్బులు వసూలు చేసేందుకు కుట్ర : ఎమ్మెల్యే మందుల సామేల్‌

Telugu Lo Computer
0


తెలంగాణలోని సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌ మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కొందరు కావాలని నన్ను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. నేను నియోజకవర్గం నుంచి ఇసుక తరలించవద్దని ఆపేస్తే నేనే ఇసుక దందా చేస్తున్నట్లు ఆరోపించిన మాటల్లో వాస్తవం లేదు. నాపై తప్పుడు ప్రచారం చేసి నా దగ్గర డబ్బులు వసూలు చేసేందుకు కుట్ర పన్నిన వారిని, వారికి సహకరించిన వారిని వదిలే ప్రసక్తే లేదని అన్నారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలతో కలిసి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. ఎమ్మెల్యే మాటలను వక్రీకరించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు దొంగరి గోవర్ధన్‌ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. ఈ ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై క్రాంతికుమార్‌ తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని గుండాల మండలం రామారానికి చెందిన రంగయ్యగౌడ్, తిరుమలగిరి వాసి, భారాస సోషల్‌ మీడియా ప్రతినిధి శంకుయాదవ్, ఊటుకూరుకు చెందిన వేముల పండు, అన్నారానికి చెందిన మజీద్, తుంగతుర్తికి చెందిన తడ్కమళ్ల రవిలపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)