తెలంగాణలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏకకాలంలో 12 చోట్ల రైడ్స్ జరుపుతున్నారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర పని చేసిన నూనె శ్రీధర్ ఇంట్లో ఇవాళ తనిఖీలు నిర్వహిస్తున్నారు. నూనె శ్రీధర్‌ని అదుపులోకి తీసుకొని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర శ్రీధర్ పనిచేశారు. నూనె శ్రీధర్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసును ఏసీబీ అధికారులు నమోదు చేశారు. అయితే ఈ సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర పని చేసిన నూనె శ్రీధర్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు
June 11, 2025
0
Tags