అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న డ్రాగన్‌ స్పేస్‌క్రాఫ్ట్‌

Telugu Lo Computer
0


భారత వ్యోమగామి, గ్రూప్‌ కెప్టెన్‌ శుభాన్షు శుక్లా పయనిస్తున్న  డ్రాగన్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ విజయవంతంగా అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌లో బుధవారం మధ్యాహ్నం 12.01 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ప్రయోగించిన స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఫాల్కన్‌-9 రాకెట్‌ నిప్పులు చిమ్ముతూ విజయవంతంగా రోదసిలోకి దూసుకెళ్లింది. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఈ వ్యోమనౌక ఐఎస్‌ఎస్‌కు చేరువైంది.  14 రోజులపాటు  వ్యోమగాములు అంతరిక్షంలో ఉండనున్నారు. నాసా సహకారంతో శుక్లా ఐఎస్‌ఎస్‌లో వివిధ శాస్త్రీయ పరిశోధనలు చేయనున్నారు. ఈ మిషన్‌కు శుక్లా పైలట్‌గా వ్యవహరిస్తున్నారు. 1984లో సోవియట్‌ యూనియన్‌కు చెందిన ఇంటర్‌కాస్మోస్‌ మిషన్‌ కింద సూయజ్‌ టీ-11 వ్యోమనౌకలో భారత వ్యోమగామి రాకేశ్‌శర్మ తొలిసారిగా అంతరిక్షంలోకి వెళ్లి ఎనిమిది రోజులపాటు ఉండి తిరిగి వచ్చారు. తాజా ప్రయోగంతో 41 ఏండ్ల తర్వాత రోదసిలోకి వెళ్తున్న రెండో భారతీయుడిగా శుభాన్షు రికార్డు సృష్టిస్తున్నారు. శుభాన్షు శుక్లా ఐఎస్‌ఎస్‌లోకి వెళ్తున్న తొలి భారతీయుడు.


Post a Comment

0Comments

Post a Comment (0)