విద్యార్థులకు ఎలాంటి ఉచిత ల్యాప్‌టాప్‌లూ ఇవ్వడంలేదు : కేంద్ర ప్రభుత్వం

Telugu Lo Computer
0


కేంద్ర ప్రభుత్వం విద్యార్థులందరికీ ఉచితంగా ల్యాప్‌టాప్‌లను అందిస్తున్నట్లు పేర్కొంటూ వాట్సప్‌లో వారు మెసేజ్‌లు పంపడంపై కేంద్రం అప్రమత్తమైంది. ప్రభుత్వం ఎలాంటి ఉచిత ల్యాప్‌టాప్‌లూ ఇవ్వడంలేదని స్పష్టం చేస్తూ పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌ విభాగం 'ఎక్స్‌'లో పోస్టు పెట్టింది. ''కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లను అందించడం ద్వారా విద్యలో డిజిటలైజేషన్‌ను ప్రోత్సహిస్తోంది. అందువల్ల మీరు కేంద్ర ప్రభుత్వ ఉచిత ల్యాప్‌టాప్‌ పథకం కింద ఉచిత ల్యాప్‌టాప్‌ పొందాలనుకుంటే అధికారిక సైట్‌ను సందర్శించి మీ అర్హతను చెక్‌ చేసుకోచ్చు'' అని పేర్కొంటూ సైబర్‌ కేటుగాళ్లు పంపిన మెసేజ్‌ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం కోరింది. ఈ సందేశం నకిలీది, పూర్తిగా మోసపూరితమైనదని ప్రకటించింది. ఇలాంటి అనుమానాస్పద లింక్‌లపై క్లిక్‌ చేయొద్దని కోరింది. ఎప్పుడైనా అధికారిక వర్గాల ద్వారా సమాచారాన్ని వెరిఫై చేసుకోవాలని కేంద్రం సూచించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)