తేజస్వి యాదవ్ సభలో ప్రసంగిస్తుండగా అదుపుతప్పి మీదకు దూసుకొచ్చిన డ్రోన్‌

Telugu Lo Computer
0

బీహార్‌ లోని పాట్నా గాంధీ మైదానంలో 'వక్ఫ్ బచావో, సంవిధాన్ బచావో' నినాదంతో బహిరంగ సభ జరిగింది.ఆర్జేడీ నేత  తేజస్వి యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తుండగా సభను కవర్‌ చేసేందుకు ఏర్పాటు చేసిన డ్రోన్‌ అదుపుతప్పి తేజస్వి యాదవ్ వైపు డ్రోన్‌ దూసుకువచ్చింది. దీంతో ఆయన అప్రమత్తమయ్యారు. దాని బారి నుంచి తప్పించుకునేందుకు పక్కకు ఒంగారు. అయితే ఆ డ్రోన్‌ వేదిక ముందు పడిపోయింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Post a Comment

0Comments

Post a Comment (0)