హిమాచల్ ప్రదేశ్‌ లో రెండు వర్గాల మధ్య ఘర్షణ

Telugu Lo Computer
0


హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రం సిర్మౌర్‌లోని పాంటా సాహిబ్ ప్రాంతంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒక వర్గానికి చెందిన అమ్మాయి మరో వర్గానికి చెందిన అబ్బాయితో పారిపోవడంతో ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనలో పోలీసులతో సహా 10 మంది గాయపడ్డారు. ఈ అంశంపై పాంట సాహిబ్ పట్టణంలో హిందూ సంస్థలు 4 రోజులుగా నిరసన తెలుపుతున్నాయి. వారు దీనిని లవ్ జిహాద్ గా అభివర్ణిస్తున్నారు. ఈ ప్రాంతంలో శాంతిభద్రతలను కాపాడటానికి పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. యువకుడితో పారిపోయిన అమ్మాయి వయస్సు 18 సంవత్సరాలు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా శుక్రవారం స్థానిక హిందూ సంస్థల సభ్యులతో కలిసి కుటుంబీకులు నిరసనకు దిగారు. కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, నహాన్ నుండి 25 కి.మీ దూరంలో ఉన్న మజ్రా వద్ద నహాన్-పావోంటా రహదారిని దాదాపు గంటసేపు దిగ్బంధించారు. కొందరు గుంపుగా ఏర్పడి ఆ యువకుడి ఇంటి వైపునకు వెళ్లారు. దీంతో అవతలి వైపు నుంచి రాళ్ల దాడి ప్రారంభమైంది. ఆ తర్వాత నిరసనకారులు కూడా రాళ్లు రువ్వారు. నిరసన కాస్త ఘర్షణగా మారింది. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు రాళ్ల దాడిని ఆపడానికి బలప్రయోగం చేయాల్సి వచ్చింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)