ఇజ్రాయెల్ వైమానిక దాడిలో తొమ్మిది మంది అణు శాస్త్రవేత్తలు మృతి

Telugu Lo Computer
0


రాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ నిర్వహించిన వైమానిక దాడిలో తొమ్మిది మంది అణు శాస్త్రవేత్తలు మరణించారు. ఈ ఆపరేషన్‌ గురించి శనివారం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) బహిర్గతం చేసింది. ఈ దాడిలో హతమైన శాస్త్రవేత్తలు, ఇరాన్ అణు బాంబు అభివృద్ధిలో కీలక పాత్రధారులు. వీరు దశాబ్దాల అనుభవం కలిగిన నిపుణులు. వారి పరిజ్ఞానం, అణ్వాయుధాల రూపకల్పనకు కీలకం అని ఐడీఎఫ్ ప్రకటించింది. దీనిని ఇరాన్ అణు ఆకాంక్షలకు గట్టి ఎదురుదెబ్బగా పేర్కొంది. ఈ దాడుల్లో చనిపోయిన వారిలో ఫెరీడూన్ అబ్బాసీ, మొహమ్మద్ తెహ్రాంచీ, అక్బర్ మొతలేబి, సయీద్ బర్జీ లాంటి ప్రముఖులు ఉన్నారు. వీరంతా భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, మెటీరియల్స్ ఇంజనీరింగ్‌లో పేరొందినవారు. వీరికి తోడుగా మరికొంత మంది సీనియర్ శాస్త్రవేత్తలు కూడా హతమయ్యారు. 2020లో హత్యకు గురైన మొహ్సెన్ ఫక్రిజాదే అనుచరులే తాజా టార్గెట్లు అన్నది ఐడీఎఫ్ వాదన. ఆయన్ని ఇరాన్ అణు ప్రాజెక్టు పితామహుడిగా పరిగణిస్తారు. ఇప్పుడు చంపబడినవారు ఆయన వారసులుగా భావించబడుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)