డబ్ల్యూఈఎఫ్‌ టెక్నాలజీ పయొనీర్ల జాబితాలో ఈక్వల్‌ కంపెనీకి చోటు

Telugu Lo Computer
0


2025 సంవత్సరానికి గాను వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం 100 టెక్నాలజీ పయొనీర్ల జాబితాలో హైదరాబాద్‌కి చెందిన డేటా షేరింగ్‌ ప్లాట్‌ఫాం ఈక్వల్‌ చోటు దక్కించుకుంది. భారత్‌ నుంచి మొత్తం 10 సంస్థలు ఈ లిస్టులో ఎంపికయ్యాయి. గతంలో డబ్ల్యూఈఎఫ్‌ పయొనీర్లుగా నిల్చిన గూగుల్, స్పాటిఫై, ఎయిర్‌బీఎన్‌బీ వంటి దిగ్గజాల సరసన తమ సంస్థ కూడా నిల్చిందని కంపెనీ వ్యవస్థాపకుడు, వెంచర్‌ క్యాపిటలిస్ట్‌ జీవీకే కేశవ్‌ రెడ్డి తెలిపారు. కేవైసీ తదితర అంశాలకు సంబంధించి డేటా షేరింగ్‌కి ఉపయోగపడే మౌలిక సదుపాయాలను ఈక్వల్‌ అందిస్తోంది. కేశవ్‌ రెడ్డి, రాజీవ్‌ రంజన్‌ కలిసి 2022లో దీన్ని నెలకొల్పారు. 2024లో 75,000 లావాదేవీలను ప్రాసెస్‌ చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)