దేశీయ మార్కెట్లో టీవీఎస్ మోటార్ కంపెనీ అపాచీ ఆర్టీఆర్ 160 తాజా వెర్షన్‌ను రూ.1.34 లక్షల(ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఈ బైక్, భద్రత కోసం డ్యూయల్-ఛానెల్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టంతో సహా అనేక అప్‌గ్రేడ్‌లతో లభిస్తుంది. ఇది 16.04 పీఎస్ పవర్‌తో 160సీసీ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ మోటార్ బైక్ భారతదేశంలో అత్యంత శక్తివంతమైన 160cc బైక్‌గా నిలుస్తుందని కంపెనీ భావిస్తోంది. వాహనాన్ని నడిపేటప్పుడు..రోడ్డు, వాతావరణ పరిస్థితులను బట్టి మెరుగైన నియంత్రణ కోసం రైడర్లు స్పోర్ట్, అర్బన్, రెయిన్ అనే మూడు రైడ్ మోడ్‌ల మధ్య మారవచ్చు. అపాచీ ఆర్టీఆర్ 160 ఎరుపు అల్లాయ్ వీల్స్, మ్యాట్ బ్లాక్, పెర్ల్ వైట్ వంటి కొత్త రంగులు, బోల్డ్, స్పోర్టీ డిజైన్‌తో లభిస్తుంది. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, వాయిస్ అసిస్ట్, రైడ్ సమాచారంతో కూడిన డిజిటల్ డిస్‌ప్లే వంటి స్మార్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ టీవీఎస్‌కు సంబంధించిన SmartXonnect సిస్టమ్‌లో భాగం. ఈ కొత్త వెర్షన్ మెరుగైన భద్రతతో పాటు, సాంకేతికతను అందిస్తూనే Apacheకి సంబంధించిన బలమైన రేసింగ్ డీఎన్ఏపై నిర్మితమైందని టీవీఎస్ మోటార్ ప్రీమియం బిజినెస్ హెడ్ 'విమల్ సుంబ్లీ' అన్నారు.
టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 తాజా వెర్షన్ విడుదల
June 27, 2025
0
Tags