విచారణ పేరుతో యువకులపై పోలీసుల దాష్టీకం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా పెద్దపప్పూరులో యువకులపై పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు. బాలిక అదృశ్యం కేసులో కొందరు యువకులను తీవ్రంగా కొట్టారు. హేమంత్‌ అనే యువకుడు బాలికను తీసుకెళ్లాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఆచూకీ చెప్పాలని అతడి స్నేహితులపై లాఠీ ఝలిపించారు. వంశీ అనే డిగ్రీ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా, విచారణ పేరుతో తమ పిల్లలను కొట్టడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసు దర్యాప్తు చేతకాక తమ పిల్లలను కొడుతున్నారన్నారు. పెద్దపప్పూరు ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)