ఉత్తరప్రదేశ్‌లోని మలిహాబాద్‌లో పోలీసులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు చేసిన ఉమ్మడి దాడిలో భారీ మొత్తంలో అక్రమ ఆయుధాలు బయటపడ్డాయి. ఓ ఇంటి నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఆయుధ నిర్మాణ సామగ్రి, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు సలావుద్దీన్ అలియాస్ లాలాను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. అతని అక్రమ ఆయుధ రవాణా నెట్‌వర్క్‌తో సంబంధాలను దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం ప్రకారం నిందితుడి ఇంటి నుంచి 3000 గన్నులు, 20 సాక్స్, 50వేల కార్ట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. వాటిపై అరబిక్, పర్షియన్ భాషలలో రాసి ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. నిందితుడి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌లో అక్రమ ఆయుధాల కొనుగోలు, అమ్మకాలతో సంబంధం ఉన్న అనేక వ్యక్తుల పేర్లు ఉన్నాయని, విచారణ పూర్తయిన తర్వాతే దీనికి ధృవీకరణ లభిస్తుందని అధికారులు తెలిపారు. త్వరలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశముందన్నారు. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఉత్తరప్రదేశ్‌లో భారీ మొత్తంలో అక్రమ ఆయుధాలు స్వాధీనం
June 30, 2025
0
Tags