అమెరికాలో రెమిటెన్స్‌ ట్యాక్స్‌ 1 శాతానికి తగ్గింపు

Telugu Lo Computer
0

మెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 'వన్‌ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లు'లో తొలుత దీన్ని 5 శాతంగా నిర్ణయించారు. ఈ బిల్లు తాజా ముసాయిదాలో ఒక శాతానికి తగ్గించారు. బ్యాంక్‌ ఖాతాలు, డెబిట్/క్రెడిట్‌ కార్డు ద్వారా చేసే చెల్లింపులను పన్ను నుంచి మినహాయించారు. మనీ ఆర్డర్‌, క్యాషియర్‌ చెక్‌ వంటి మార్గాల్లో పంపే నగదుకే ఈ పన్ను వర్తిస్తుందని పేర్కొన్నారు. అమెరికా నుంచి భారత్‌లోని కుటుంబీకులకు డబ్బులు పంపే భారతీయులపై 5% రెమిటెన్స్‌ ట్యాక్స్‌ను ఈ ఏడాది మేలో ప్రతిపాదించారు. అమెరికా పౌరులు మినహా హెచ్‌1బీ వీసాదార్లు, గ్రీన్‌కార్డు హోల్డర్లు విదేశాలకు పంపే నిధులపై ఈ పన్ను వర్తిస్తుందని బిల్లులో పేర్కొన్నారు. దీంతో అమెరికాలో నివసిస్తున్న కోట్లాది మంది భారతీయుల్లో ఆందోళన వ్యక్తమైంది. దీనివల్ల ఏడాదికి 1.6 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.13,600 కోట్లు) మేర పన్ను భారం పడొచ్చని అప్పట్లో అంచనా వేశారు. బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లు ప్రతినిధుల సభను దాటుకుని తాజాగా సెనెట్‌ ఆమోదం కూడా పొందింది. అయితే, ప్రతినిధుల సభకొచ్చేటప్పటికే ప్రతిపాదిత ఐదు శాతం పన్నును 3.5 శాతానికి తగ్గించారు. సెనెట్‌కు వచ్చిన తాజా వెర్షన్‌లో రెమిటెన్స్‌ పన్నును ఒక శాతంగా పేర్కొనడం భారతీయులకు ఊరట కల్పించే అంశం. మరోవైపు సెనెట్‌లో ఉత్కంఠ నడుమ స్వల్ప ఓట్లతో (51-49) ఈ బిల్లు ఆమోదం పొందింది. చివరకు ఇద్దరు రిపబ్లికన్లు కూడా ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. బిల్లులోని మెడికల్‌ ఎయిడ్‌ను, ఆహార కూపన్లను తగ్గించే ప్రతిపాదనలు, 3.8 ట్రిలియన్‌ డాలర్ల పన్ను విరామాన్ని వంటి అంశాలను పలువురు రిపబ్లికన్లు వ్యతిరేకిస్తున్నారు. బిల్లు మళ్లీ ప్రతినిధుల సభకు వెళ్తుంది. అక్కడ ఆమోదం పొందాక అధ్యక్షుడి దగ్గరకు వెళ్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)